కల్కి 2898 ఏడీ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసిన వేళ దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చాడు. తొలి రోజే చూసి ఎక్స్ అకౌంట్ ద్వారా తన అభిప్రాయం చెప్పాడు. డార్లింగ్ చంపేశావ్ అంటూ ప్రభాస్ ను కొనియాడగా.. మొత్తం సినిమా తననో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు తెలిపాడు. మూవీ చూసిన తర్వాత సోషల్ మీడియా ఎక్స్ లో రాజమౌళి తన రివ్యూ ఇచ్చాడు. "కల్కి 2898 ఏడీ వరల్డ్ నిర్మించిన తీరు బాగా నచ్చింది. అత్యద్భుతమైన సెటింగ్స్ తో ఇది వివిధ ప్రాంతాలకు నన్ను తీసుకెళ్లింది. తన టైమింగ్, ఈజ్ తో డార్లింగ్ చించేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపికా నుంచి మంచి సపోర్ట్ లభించింది. చివరి 30 నిమిషాల సినిమా నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దీనిని తెరపైకి తీసుకొచ్చేందుకు నాగి (డైరెక్టర్ నాగ్ అశ్విన్), మొత్తం వైజయంతీ టీమ్ కు నా శుభాకాంక్షలు" అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
إرسال تعليق