కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు !


పేటీఎంలో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments