జమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే : రెసిస్టెన్స్ ఫ్రంట్


మ్మూకాశ్మీర్​లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్​ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఆర్టీఎఫ్)  ప్రకటించుకుంది. ఇది సరికొత్త ఆరంభమని పేర్కొంది. టూరిస్ట్​లు, నాన్​లోకల్స్ పై ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించింది. ఆదివారం జమ్మూలోని రియాసీ జిల్లా నుంచి ఖత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి 53 మంది యాత్రికులతో బయల్దేరిన బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 9 మంది ప్రాణాలు తీశారు. మిగతా 43 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో మరణించిన 9 మందిలో నలుగురు రాజస్థాన్​లోని ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు రియాసి జిల్లాకు చెందినవారు.టెర్రరిస్ట్​ల దాడి అనంతరం పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు రియాసి జిల్లాలోని స్పాట్​కు చేరుకున్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక పోలీసులతో కలిసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. టెర్రరిస్టులు దాక్కొని ఉండొచ్చనే అనుమానంతో పర్వత ప్రాంతాలలో సెక్యూరిటీ ఫోర్సెస్ కూంబింగ్ ముమ్మరం చేశాయి.

Post a Comment

0 Comments