వాట్సాప్ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు పని చేస్తున్నది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ యాప్ సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే 'ఇన్ యాప్ డయలర్ ఫీచర్'ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకునే వీలుంటుంది. కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్ ఉన్నది. ఈ విషయాన్ని వాట్సాప్ ట్రాకర్ వాబీటా ఇన్ఫో తెలిపింది. యూజర్లు యాప్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం సైతం లేదని చెప్పింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కనిపిస్తుంది. దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాబీటా ఇన్ఫో వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని.. త్వరలోనే అందుబాటులోకి తీసువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
వాట్సాప్ లో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ ?
السبت، 22 يونيو 2024
science technology WhatsApp ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్ ఉన్నది వాట్సాప్ లో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ ? సాధారణ కాల్స్ చేసుకునే వీలు
ليست هناك تعليقات:
إرسال تعليق