ఆంధ్రప్రదేశ్ పింఛన్లు పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు వాటిని పెంచి పంపిణీకి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు. అర్హత కలిగిన వారికి ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు అందిస్తోంది. దీనికి సంబంధించి కీలకమైన జీవో జారీ అయింది. సీనియర్ సిటిజన్లకు, వింతువులకు, ఫిషర్ మెన్, ఒంటరి మహిళ, ట్రడిషనల్ కోబ్లర్స్, ట్రాన్స్‌జెండర్స్, ఏఆర్‌టీ (పీఎల్‌హెచ్ఐవీ), డప్పు ఆర్టిస్ట్,టోడీ తప్పర్స్, చేతివృత్తులవారికి గతంలో నెలకు రూ.3వేలు వచ్చేవి. వీటిని రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు రూ.వెయ్యి చొప్పున మూడు నెలలకు రూ.3వేలు కలిపి జులై ఒకటో తేదీన వీరికి మొత్తం రూ.7వేలు అందబోతోంది. వికలాంగులు, మల్టిడిఫార్మిటీ లెప్రసీ వారికి గతంలో రూ. 3 వేల పింఛను రాగా, కొత్త ప్రభుత్వం రూ. 6 వేలు ఇవ్వబోతోంది. వీరికి రెట్టింపు అయ్యాయి. ఫుల్లీ డిసెబుల్డ్ పర్సన్స్‌కు నెలకు రూ. 15 వేలు వస్తుంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైవారికి నెలకు రూ. 15 వేల పింఛను లభిస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులకు ఇకనుంచి రూ. 15 వేలు పెన్షన్ వస్తుంది. గతంలో వీరికి రూ.5వేలు మాత్రమే వచ్చేది. క్రోనిక్ డిసీజ్‌లు ఉన్నవారికి రూ. 10 వేలు, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగినవారికి రూ.10 వేలు (గతంలో వీరికి రూ.5వేలు ఇచ్చేవారు) రానుంది. డయాలసిస్ చేయించుకునేవారికి నెలకు రూ.10 వేలు వస్తుంది. 

Post a Comment

أحدث أقدم