ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండు చోట్ల కూడా ఆయన భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా కొనసాగాలి. ఈ క్రమంలో ఒక సమావేశంలో మాట్లాడిన రాహుల్ ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాహుల్ వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని వినికిడి. ఇదిలా ఉంటే, వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఇప్పుడు రాహుల్ రాజీనామతో వయనాడ్ స్థానం ఖాళీ అయితే అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు.
వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ ?
الجمعة، 14 يونيو 2024
kerala national భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నకేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకరన్ వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ ? వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని వినికిడి
ليست هناك تعليقات:
إرسال تعليق