టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా పుష్ప-ది రూల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పుష్ప2′ కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ