మణుగూరులో 1.19 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సీతారామరాజు జిల్లా డొంకరాయి నుంచి మణుగూరు మీదుగా తెలంగాణలోని జహీరాబాద్ వరకు ట్రాలీలో 477 కిలోల గంజాయిని మామిడికాయల మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1.19 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌లో సోమవారం డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్న షేక్ ఫరూక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4.1 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments