తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ?


తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్ గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. సీతక్క ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్ గా చేస్తే పార్టీ నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట. ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. సీతక్క ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్ గా చేస్తే పార్టీ నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట!. అయితే.పీసీసీ చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీలు పీసీసీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అనూహ్యంగా రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికి సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మినబంటుగా పేరుంది. అయితే రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసి కట్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో సీతక్కను పీసీసీ చీఫ్ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని సమాచారం.

Post a Comment

0 Comments