ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోగంగు మహేశ్వర రెడ్డి షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కరెంట్ పోవడంతో ఉక్కపోతను భరించలేక సబ్‌స్టేషన్‌కు గ్రామస్థులు ఫోన్ చేశారు. అయినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో అంతా కలిసి సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. అది చూసిన గ్రామస్థులు ఆఫీసులో ఏంటీ  పనులు అంటూ నిలదీశారు. ఇలాంటి ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు.

Post a Comment

أحدث أقدم