మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ యాక్ట్, 1938 ప్రకారం కార్పొరేట్ ఏజెంట్‌గా వ్యవహరించడానికి IRDAI నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించింది. ఈ రిజిస్ట్రేషన్ 2024 మే 21 నుంచి 2027 మే 20 వరకు చెల్లుబాటులో ఉంటుందని మహీంద్రా ఫైనాన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ లైసెన్స్‌తో మహీంద్రా ఫైనాన్స్ బీమా ప్లాన్స్‌ను అందించడానికి వీలు కలుగుతుంది. మహీంద్రా ఫైనాన్స్‌కు చెందిన 1360 శాఖల్లో ఈ బీమా సేవలు లభిస్తాయని మహీంద్రా ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈఓ రౌల్ రెబెల్లో తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ ఈ కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్‌తో బీమా కంపెనీల తరఫున జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాతో సహా అన్ని రకాల బీమా ఉత్పత్తులను విక్రయిస్తుంది. మెట్రో, టైర్-1 నగరాలతో పోలిస్తే భారత్‌లోని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో బీమా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. మహీంద్రా ఫైనాన్స్‌కు ఉన్న బ్రాంచీల నెట్‌వర్క్‌తో బీమా రంగంలో మరిన్ని సేవలను అందించనుంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించిన ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒక కోటికి పైగా కస్టమర్లను కలిగి ఉంది. దీని నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 11 బిలియన్ డాలర్ల (రూ.91 వేల కోట్లు)కు పైగా ఉంది. మహీంద్రా ఫైనాన్స్..అనేక మోటారు వాహనాలకు, SMEలకు రుణాలను అందించడమే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా సేకరిస్తోంది.
0 Comments