కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతీ విషయానికి సమావేశాలకు హాజరుకాకుండా పార్లమెంటును అగౌరవ పరుస్తుందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన చట్టాలపై వారు లేవనెత్తే ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్తామని, అయినా కూడా సమావేశాల మధ్యలో లేచి వెళ్లిపోవడం, చర్చలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడతారని దుయ్యబట్టారు. ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కావా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో మార్పు వచ్చిందని, అప్పటినుంచి పార్టీ ప్రమాణాలు పడిపోయాయన్నారు. గత 20 ఏళ్లుగా వారు పార్లమెంటును బహిష్కరించడానికి రకరకాల సాకులు చెప్తున్నారన్నారు. ''రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాన మంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు గంటన్నర పాటు ఆయనకు అంతరాయం కలిగించడం నా రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ చూడలేదు. దేశ ప్రజలు తమ ఓట్లతో నరేంద్ర మోడీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఆయనను అగౌరవపరచడం రాజ్యాంగ వ్యవస్థను అగౌరవపరచడంతో సమానం''అని షా పేర్కొన్నారు.
రాహుల్ వచ్చాక కాంగ్రెస్ ప్రమాణాలు పడిపోయాయని అమిత్ షా ఎద్దేవా !
الاثنين، 27 مايو 2024
national ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి రాహుల్ వచ్చాక కాంగ్రెస్ ప్రమాణాలు పడిపోయాయని అమిత్ షా ఎద్దేవా సమావేశాలకు హాజరుకాకుండా పార్లమెంటును అగౌరవ పరుస్తుందని
ليست هناك تعليقات:
إرسال تعليق