ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం 24 కేసుల్లో 11.40 కిలోల బంగారం పట్టుబడింది. వీటితోపాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం, వస్తువుల విలువ రూ.7.46 కోట్లుగా అంచనా. బట్టలు, శానిటరీ ప్యాడ్స్, ట్రాలీ, లోదుస్తులు వంటి ఇతర ప్రదేశాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముంబై విమానాశ్రయంలో రూ.7.46 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
الخميس، 23 مايو 2024
maharashtra national పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముంబై విమానాశ్రయంలో రూ.7.46 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ليست هناك تعليقات:
إرسال تعليق