జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్ ఎస్ సీ  బోర్డు ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఫస్ట్ లాంగ్వేజ్ (కంపోజిట్ కోర్సు) ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, సైన్స్ పార్ట్-1 ఫిజికల్ సైన్స్‌ను, పార్ట్ 2 బయోలాజికల్ సైన్స్‌ను ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 51,237 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 31,625 మంది అబ్బాయిలు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 170 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 1300 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

Post a Comment

أحدث أقدم