చైనా మార్కెట్లో వివో వై200ఐ విడుదల !


వివో బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వివో వై200ఐ ను తీసుకొచ్చింది. దీనిని చైనా మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ ఈ ఫోన్‌ సొంతం. సెక్యూరిటీ పరంగా చూస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ సైడ్‌కి అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,800, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,200గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,500గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను గ్లేసియర్ వైట్, స్టారీ నైట్, వాస్ట్ సీ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. వివో వై200ఐలో స్టీరియో స్పీకర్లను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

Post a Comment

0 Comments