ఆండ్రాయిడ్ గూగుల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్. ఆండ్రాయిడ్​ 15 ఫుల్ వర్షన్ ఆగస్టు లేదా సెప్టెంబర్​ నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది. అదే.. 'శాటిలైట్ మెసేజింగ్'.  మారుమూల ప్రాంతాల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్​లు చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్​ 15 బీటా వెర్షన్​లో 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ నుంచైనా, ఎవరికైనా మెసేజ్‌లను పంపొచ్చు. వైఫై , మొబైల్ నెట్​వర్క్ సిగ్నల్స్ లేకున్నా మెసేజ్‌ను పంపే వీలుంటుంది. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్(Messages Via Satellite) ఇప్పటికే ఐఫోన్స్​లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే అది అత్యవసర సేవలకు పరిమితం. ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్​లో 'శాటిలైట్ మెసేజింగ్'ను అత్యవసర సేవలతో పాటు మెసేజ్​లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వాడుకొని మనం ఫొటోలు, వీడియోలను సెండ్ చేయలేం. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​లో 3 కీలకమైన అంశాలపై దృష్టిసారించింది. అవి ప్రైవసీ/ సెక్యూరిటీ, సపోర్టింగ్ క్రియేటర్స్​ అండ్ డెవలపర్స్​, మాక్సిమైజింగ్​ యాప్​ పెర్ఫార్మెన్స్. ఆండ్రాయిడ్ 15 అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతానికి గూగుల్​ పిక్సెల్​, ట్యాబ్లెట్స్​లో మాత్రమే ఆండ్రాయిడ్ 15 డెవలపర్​ ప్రివ్యూ 1ను టెస్ట్ చేయడానికి వీలవుతుంది. పిక్సెల్​ 8, పిక్సెల్​ 8ప్రో, పిక్సెల్​ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ ఫోల్డ్​, పిక్సెల్ ట్యాబ్లెట్​ల్లో ఆండ్రాయిడ్​ 15ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ