75 లక్షల మంది పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు లీక్‌ ?

الثلاثاء، 9 أبريل 2024

75 లక్షల మంది పేర్లు science technology ఈమెయిల్ ఐడీలు లీక్‌ ? డార్క్‌ వెబ్‌ ఫోన్‌ నంబర్లు ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడి

t f B! P L


75 లక్షల మంది బోట్‌ వినియోగదారుల డేటా ప్రస్తుతం డార్క్‌ వెబ్‌లో ఉందని ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది. బోట్‌ సంస్థ స్మార్ట్‌వాచ్‌, ఆడియో ఉత్పత్తుల తయారీతో పాపులర్‌ బ్రాండ్‌గా ఉంది. ఈ లీక్‌ అయిన డేటాలో పేర్లు, అడ్రస్‌, కాంటాక్ట్‌ నంబర్‌, ఈమెయిల్‌, కస్టమర్‌ ఐడీ వంటి వివరాలున్నాయని తెలుస్తోంది. ఈ డేటా లీక్‌ గురించి హ్యాకర్‌ ShopifyGUY ఏప్రిల్‌ 5న ధ్రువీకరించారు. బోట్‌ ఉత్పత్తుల వినియోగదారులు కొంత మంది నుంచి కూడా ఈ డేటా లీక్ ధ్రువీకరించబడింది. పబ్లిక్‌ డొమైన్‌లో దొరికిన డేటాతోపాటు బోట్‌ సర్వర్‌ నుంచి దొంగిలించబడినట్లుగా తెలుస్తోంది. డేటా లీక్‌ కారణంగా ఆర్థిక మోసాలు సహా ఫిషింగ్‌ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనధికార లావాదేవీలు లేదా క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ డేటాలో ప్రస్తుతం ఈ డేటా లీక్‌ వెలుగులోకి రావడంతో భద్రతా లోపాలను పరిష్కరించేందుకు మరియు కస్టమర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచే విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అయితే బోట్‌ అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది. ఈ డేటా లీక్‌పై థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు సౌమయ్‌ శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ ఇంజినీరింగ్ దాడులు, బ్యాంకు ఖాతాల అనధికార యాక్సెస్‌, మోసపూరిత లావాదేవీలు మరియు క్రెడిట్‌ కార్డు వివరాలను దుర్వినియోగం చేసేందుకు ఈ వ్యక్తిగత సమాచారం ఉపయోగించవచ్చని అనుమానించారు. బోట్‌ సంస్థ తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బృందం వ్యవస్థాపకుడు యష్‌ కడకియా అన్నారు. దీనిపై బాధితులు అందరికీ తెలియజేయాలని, మరియు ఈ లీక్‌పై పూర్తిస్థాయిలో పరిశోధన జరగాలని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ