ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి 9 వరకు ప్రారంభం కానున్నది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు సహా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. దీంతోపాటు గృహోపకరణాలపైనా తగ్గింపు ధరలను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు, EMI లావాదేవీలు నిర్వహించే కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలని సంస్థ కోరింది. దీని ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని పేర్కొంది. సేల్ లో భాగంగా ఆపిల్, శాంసంగ్, రియల్‌మి, మోటోరోలా సహా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లును పొందవచ్చని తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండనున్నాయి. టీవీలు, స్మార్ట్‌టీవీలు సహా ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఏయే బ్రాండ్ల ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్ ఉంటుందో సంస్థ వెల్లడించలేదు. దీంతోపాటు వేసవి కాలం దృష్ట్యా ఎయిర్ కండిషనర్, ఎయిర్ కూలర్ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది.
ఫ్లిప్ కార్ట్ లో మే 3 నుంచి 9 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 !
السبت، 27 أبريل 2024
flipkart science technology ఫ్లిప్ కార్ట్ లో మే 3 నుంచి 9 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024
ليست هناك تعليقات:
إرسال تعليق