ఒప్పో ఏ 78 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. గత ఏడాది జనవరిలో దేశీయ మార్కెట్లో రూ.18,999కి లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,500 తగ్గింది. కస్టమర్లు అమెజాన్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 15,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆక్వా గ్రీన్, మిస్ట్ బ్లాక్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, FHD+(2400×1080) డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13,5000mAh బ్యాటరీ వంటి ఫీచర్‌లతో ఈ ఫోన్ వస్తుంది. Oppo A78 ఫోన్.. 90Hz రిఫ్రెష్ రేట్,FHD+ 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.4 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్ ఉంది. దీని ఇంటర్నల్ మెమరీ 128GB, దీన్ని కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13 పై రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8MP కెమెరా కూడా అందించబడింది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంట్ ఇవ్వబడింది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ 5000 mAh..67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందుబాటులో ఉంది.
ఒప్పో ఏ 78 స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
Friday, March 15, 2024
5000mAh బ్యాటరీ amazon FHD+(2400×1080) డిస్‌ప్లే oppo Qualcomm Snapdragon 680 ప్రాసెసర్ smart phone ఆండ్రాయిడ్ 13 ఒప్పో ఏ 78 స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్
No comments:
Post a Comment