ఐఫోన్, మ్యాక్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రానున్న ఐఓఎస్ 18 అప్‌డేట్ ఏఐ పవర్‌తో రానుందని భావిస్తున్నారు. శాంసంగ్, గూగుల్ ఇప్పటికే తమ సొంత ల్యాంగ్వేజ్ మోడల్స్‌లో ఏఐ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టగా యాపిల్ నుంచి ఎలాంటి ఏఐ అప్‌డేట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న యాపిల్ ఫ్యాన్స్‌కు టిమ్ కుక్ ప్రకటన ఉత్తేజాన్ని ఇచ్చింది. జనరేటివ్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఫీచర్లపై కసరత్తు సాగుతోందని, సంవత్సరాంతానికి ఈ సేవలు కస్టమర్లకు చేరతాయని టిమ్ కుక్ ఇటీవల ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వెల్లడించారు. ఏఐ సహా భవిష్యత్ టెక్నాలజీపై పెట్టుబడులను యాపిల్ కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
ホーム
/
technology
/
యాపిల్ డివైజ్‌లకు జనరేటివ్ ఏఐ ఫీచర్లు ?
Friday, February 2, 2024
CEO Tim Cook Generative AI features for Apple devices? iOS 18 update is expected to come with AI power. scieness technology
No comments:
Post a Comment