తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా, అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్‌కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్‌ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఎన్ని రోజులైనా కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్‌తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్‌కు చెల్లించాలని లేదా స్కూటర్‌ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది.
బెన్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారీ జరిమానా !
السبت، 20 يناير 2024
000 electric scooter science technology ఖర్చుల కింద రూ.10 బెన్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారీ జరిమానా రూ.10 లక్షల జరిమానా స్కూటర్ ధరను కస్టమర్‌కు చెల్లించాలని లేదా స్కూటర్‌ను భర్తీ చేయాలి
ليست هناك تعليقات:
إرسال تعليق