దేశంలో గూగుల్ డ్రైవ్ ప్లాన్‌లు 100 జీబీ నుంచి ప్రారంభమవుతాయి. ఇది నెలకు రూ. 130కి వస్తుంది. కానీ ప్రత్యేక ఆఫర్ ద్వారా మూడు నెలల పాటు రూ. 35కి డ్రైవ్ స్టోరేజ్‌ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత వ్యక్తి నెలకు రూ.130 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు 200 జీబీ డ్రైవ్ ప్లాన్ కావాలంటే, ధర నెలకు రూ. 210. కానీ ఆఫర్ ధర మూడు నెలలకు రూ. 50కి మీకు లభిస్తుంది. నెలకు రూ. 650 ఖరీదు చేసే అత్యధిక 2 టీబీ డ్రైవ్ ప్లాన్‌కు ప్రయోజనాలు అందుతాయి. అయితే మీరు దేశంలో మూడు నెలలకు రూ.160కి దీన్ని పొందవచ్చు. మీరు ఇప్పటికే గూగుల్ డిస్క్ చెల్లింపుదారులైతే ఈ డ్రైవ్ ప్లాన్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ డిస్క్‌పై ప్రజలకు ప్రత్యేక ఆసక్తిను కలుగజేయడానికి ఈ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 15 జీబీ డేటా వినియోగానికి దగ్గరగా ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ ఆఫర్ కనిపిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ ఆఫర్ మూడు నెలల మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పూర్తి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా తగ్గింపు ధరలోనే వారికి అలవాటయ్యేలా చేయడానికి గూగుల్ ఈ చర్యలు తీసుకుంది.
గూగుల్ న్యూ ఇయర్ ఆఫర్ !
الجمعة، 5 يناير 2024
100 జీబీ నుంచి ప్రారంభం google drive science technology గూగుల్ న్యూ ఇయర్ ఆఫర్ నెలకు రూ. 130 మూడు నెలల పాటు రూ. 35కి డ్రైవ్ స్టోరేజ్
ليست هناك تعليقات:
إرسال تعليق