మోటోరోలా జీ 34 5జీ స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్ లో మోటోరోలా రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది . ప్రస్తుతం భారత మార్కెట్ లో అందుబాటులో ఉన్న చాలా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లకు ఈ ఫోన్ భారీ పోటీగా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను కంపెనీ 10 వేల బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో అందించింది. ఇది 4 GB + 128 GB వేరియంట్ ధర. ఈ ఫోన్ యొక్క 8 GB + 128 GB వేరియంట్ ను రూ. 11,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ ను సన్నని మరియు అల్ట్రా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ డిస్ప్లే HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS తో, Snapdragon 695 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ బడ్జెట్ కేటగిరిలో ఈ ప్రోసెసర్ ను కలిగిన ఏకైక ఫోన్ ఇదే అవుతుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 8GB వరకూ ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో పాటుగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ 50MP + 2MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 20W ఫాస్ట్ ఛార్జర్ ను బాక్స్ తో పాటుగా అందచేస్తోంది.
దేశీయ మార్కెట్లోకి మోటోరోలా జి 34 5జీ విడుదల
Tuesday, January 9, 2024
120Hz రిఫ్రెష్ రేట్ 6.5 ఇంచ్ డిస్ప్లే HD+ రిజల్యూషన్ motorala science smart phones technology అల్ట్రా ప్రీమియం డిజైన్ దేశీయ మార్కెట్లోకి మోటోరోలా జి 34 5జీ విడుదల
No comments:
Post a Comment