బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే అదనంగా డేటా కూడా లభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్/ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అదనపు డేటా లభిస్తుంది. రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా అందించనున్నారు. కానీ దీపావళి సందర్భంగా అదనపు డేటా కూడా లభించనింది. దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రూ.299 ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్నప్పటికీ అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. దీనికి  సెల్ఫ్ కేర్ యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. రోజుకు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు లభించనున్నాయి. ఈ లిస్ట్ లో చేరిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.398 వోచర్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 కాల్స్ లభించనుంది. 120 జీబీ డేటా కూడా అందించనున్నారు. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులకు చేరింది. దీంతోపాటు అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ ల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందుబాటులో ఉండనుంది. బీఎస్ఎన్ఎల్ గతేడాది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, చవకైన రెండో ప్లాన్ ధర రూ.439గా ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలితే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం అందించడం లేదు. బీఎస్ఎన్ఎల్ దగ్గర మిగతా నెట్వర్క్ ల లేని ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి. అదే రూ.398 ప్లాన్. బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ డేటాను అందించనుంది. దీంతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ