ఆగస్టులో హీరో మోటోకార్ప్ కరిజ్మా రీబ్రాండెడ్ వెర్షన్‌ను 'కరిజ్మా XMR 210' పేరుతో ఆవిష్కరించింది. ప్రస్తుత ట్రెండ్‌కు తగిన డిజైన్, మంచి ఫీచర్లు, బలమైన పనితీరు కారణంగా ఇది కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే రూ.1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ అయిన ఈ బైక్ ధరలను హీరో మోటోకార్ప్ తాజాగా పెంచింది. సోమవారం కరిజ్మా XMR 210 కొత్త ధరను సంస్థ ప్రకటించింది. ఇప్పుడు రూ.1.80 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. అక్టోబర్ 1 నుంచి బైక్ కొత్త ధరలతో బుకింగ్స్‌కు అందుబాటులో ఉంటుంది. పండుగ అమ్మకాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ఈ వెహికల్ ధరను కంపెనీ రూ.7వేల మేరకు పెంచింది. కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోహీరో కరిజ్మా XMR 210 మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే 7046210210 నంబర్‌కు కాల్ చేసి కూడా బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం రూ.3,000 టోకెన్ ఫీజు చెల్లించాలి. కొత్త బుకింగ్ విండో త్వరలో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో బైక్ కొత్త ధరతో అందుబాటులో ఉంటుంది. త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కరిజ్మా XMR 210 సరికొత్త లిక్విడ్-కూల్డ్, 210cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మోటార్ 9,250rpm వద్ద 25.5hp పవర్‌ను, 7,250rpm వద్ద 20.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో పెయిర్ అయ్యి ఉంటుంది. కొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌లో ఉంటుంది. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌తో బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది ఎల్లో, రెడ్, మాట్టే బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
కరిజ్మా XMR 210 ధర పెంపు
الثلاثاء، 26 سبتمبر 2023
automobile science technology అక్టోబర్ 1 నుంచి బైక్ కొత్త ధరలతో బుకింగ్స్ ఎల్లో కరిజ్మా XMR 210 ధర పెంపు మాట్టే బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది రెడ్
ليست هناك تعليقات:
إرسال تعليق