షావోమి కంపెనీ రెడ్‌మి 12 ఫోన్ ఇటీవలనే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన 28 రోజుల్లోనే 10 లక్షల మంది కొన్నారని షావోమి కంపెనీ వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. అంటే ఈ ఫోన్‌కు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 14,999. అయితే దీన్ని మీరు రూ. 9999కే కొనొచ్చు. అంటే 33 శాతం డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 500 తగ్గింపు వస్తుంది. అప్పుడు రూ. 9499కే ఈ ఫోన్ కొన్నట్లు అవుతుంది. అలాగే ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 9,400 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్ ఆధారంగా మీకు వచ్చే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా మారుతుంది. ఇకపోతే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, హీలియో జీ88 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.79 ఇంచుల స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ