తమిళనాడు సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. భారతదేశం నుండి ఇతర దేశాలకు దాని ఎగుమతులను పెంచడానికి ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో యాపిల్ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో సిరీస్ 14ని అసెంబ్లింగ్ మొదలుపెట్టింది. చైనాలో జరిగిన వారం రోజుల్లోనే భారత్‌లో అసెంబ్లింగ్ ప్రారంభమైంది. కాగా ఇప్పుడు ఈ సంస్థ భారతదేశం మరియు చైనా నుండి ఒకేసారి ఐఫోన్ 15 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్ తయారీ ఉత్పత్తిని భారత్ లో ప్రారంభించడం పరిశ్రమ వర్గాలు మరోలా కూడా భావిస్తున్నాయి. చైనాతో ఎప్పటికైనా ప్రమాదమే అని ఆ సంస్థ భావిస్తోందట. అందుకే భారత్ అయితే ఎలాంటి సమస్య ఉండదని భావించి భారత్ లో తమ ఉత్పత్తులని ప్రారంభించేందుకు మొగ్గు చూపినట్టు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తమిళనాడులో యాపిల్ తయారీ సంస్థ
الخميس، 17 أغسطس 2023
apple science technology తమిళనాడులో యాపిల్ తయారీ సంస్థ శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది
ليست هناك تعليقات:
إرسال تعليق