ఆగస్టు 29న వన్‌ప్లస్ తన తొలి ఫోల్డింగ్ ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. ఈ డివైజ్ పేరు గతంలో వన్‌ప్లస్ వీ ఫోల్డ్ అని ప్రచారంలో ఉండగా కంపెనీ ఫోల్డింగ్ ఫోన్‌ను వన్‌ప్లస్ వన్‌గా నిర్ధారించిందని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 లాంఛ్ అయిన నెలరోజుల అనంతరం ఆగస్ట్ 29న వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారని స్మార్ట్‌ప్రిక్స్ పేర్కొంది. వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ నోట్‌బుక్ తరహా ఫ్యాక్టర్‌తో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌ను పోలిఉంటుంది. ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను వన్‌ప్లస్ లాంఛ్ చేస్తుందా లేదా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక వన్‌ప్లస్ అనుబంధ కంపెనీ ఒప్పో ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎన్2ఫ్లిప్‌ను లాంఛ్ చేసింది. వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ లెదర్ బ్యాక్‌తో పాటు భారీ ఎక్ట్ర్సనల్ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణుల అంచనా. వన్‌ప్లస్ 11 తరహాలో కెమెరా రౌండ్ మాడ్యూల్‌తో రానుంది. మొబైల్ వెనుక ఎడమ వైపున ఎల్ఈడీ లైట్ ఆకర్షణగా నిలుస్తుంది. కెమెరా మాడ్యూల్ దిగువన వన్‌ప్లస్ లోగోను డిజైన్ చేశారు. ఇక వన్‌ప్లస్ వన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్, 2కే అమోల్డ్ (ఎల్టీపీఓ) డిస్‌ప్లేతో 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వన్‌ప్లస్ తొలి ఫోల్డింగ్ ఫోన్ వన్‌ప్లస్ వన్ లేదా వన్‌ప్లస్ వీ ఫోల్డ్ ధర రూ. లక్ష పైనే ఉంటుందని అంచనా. https://t.me/offerbazaramzon
ఆగస్టు 29న వన్‌ప్లస్ వన్ ఫోల్డింగ్ ఫోన్ విడుదల !
الجمعة، 14 يوليو 2023
2కే అమోల్డ్ డిస్‌ప్లేతో 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ science technology ఆగస్టు 29న వన్‌ప్లస్ వన్ ఫోల్డింగ్ ఫోన్ విడుదల ! స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్
ليست هناك تعليقات:
إرسال تعليق