వెలెవ్ మోటార్స్ వెవ్ 01 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 32,500. ఈ ధర స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఐకూ , షావోమి, శాంసంగ్ వంటి కంపెనీలు అందించే పలు మోడళ్ల ధరలో సగం రేటుకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఐకూ 11 స్మార్ట్ ధర రూ. 60 వేల వరకు ఉంది. షావోమి 13 ప్రో ధర అయితే రూ. 80 వేల వరకు ఉంది. అంటే మీరు ఫోన్ ధరలో సగం రేటుకే ఈ స్కూటర్‌ను ఇంటికి తీసుకువెళ్లొచ్చు. ఈ స్కూటర్‌లో బీఎల్‌డీసీ హబ్ మోటార్ ఉంటుంది. దీని కెపాసిటీ 250 వాట్స్. లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీని కెపాసిటీ 48వీ 20 ఏహెచ్. అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. చార్జింగ్ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఇంకా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఈ స్కూటర్ రెడ్, బ్లూ, యెల్లో రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేసే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ధర ఎక్కువ అయినా పర్వాలేదు అని అనుకుంటే.. అప్పుడు ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించొచ్చు. దాదాపు చాలా వాటి ధర రూ. లక్షకు అటు ఇటుగా ఉన్నాయి. అయితే మీరు డబ్బులు పెట్టే కొద్ది ఫీచర్లు కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక స్పీడ్‌తో దూసుకుపోవచ్చు. కొన్ని స్కూటర్ అయితే ఏకంగా 300 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉన్నాయి. టాప్ స్పీడ్ 100 కి.మీ.
రూ. 32,500 లకే ఎలక్ట్రిక్ స్కూటర్ !
السبت، 20 مايو 2023
500 లకే ఎలక్ట్రిక్ స్కూటర్ ! electric scooter technology ఒక్కసారి చార్జ్ చేస్తే 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది కెపాసిటీ 48వీ 20 ఏహెచ్ రూ. 32 స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే
ليست هناك تعليقات:
إرسال تعليق