టాటా మోటార్స్ రీసెంట్‌గా ఈ కంపెనీ టాటా పంచ్ 2023 మైక్రో SUVని అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు SUV-వంటి డిజైన్, స్టైలింగ్‌తో విడుదలైన ఒక హ్యాచ్‌బ్యాక్. ఇది టాటా నెక్సాన్, హారియర్ లైట్ వెర్షన్‌గానూ కనిపిస్తుంటుంది. రూ.5,99,900 (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) స్టార్టింగ్ ప్రైస్‌తో అందుబాటులో ఉన్న ఈ టాటా పంచ్‌లో 1.2 రెవోట్రాన్ ఇంజన్‌ను ఆఫర్ చేశారు. ఇది సిటీ రోడ్లపై ఈజీగా దూసుకెళ్లడమే కాకుండా ఎగుడు దిగుడు భూభాగాలపై కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. అందుకోసం దీనిలో 187mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. దీని వీల్‌బేస్ 2,445mm సైజు ఉంటుంది. టాటా పంచ్ 2023 కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆప్షన్లతో వస్తుంది. దీని పవర్ ఔట్‌పుట్ విశేషాలు తెలుసుకుంటే, ఇది 86PS పవర్, 113Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారులో ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, క్రియేటివ్ అనే నాలుగు ప్రత్యేకమైన ట్రిమ్స్‌ ఉన్నాయి. ప్రతి వెర్షన్ దాని డిఫరెంట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లభిస్తాయి. కాగా అడ్వెంచర్, అకంప్లిష్డ్ ట్రిమ్‌లు కామో ఎడిషన్‌లో ఆప్షనల్ రిథమ్ & డాజిల్ యాక్సెసరీ సెట్‌లతో అందుబాటులో ఉన్నాయి. టాప్-స్పెక్ క్రియేటివ్ ట్రిమ్ కాజిరంగా ఎడిషన్‌తో లభిస్తుంది. కామో, రిథమ్ & డాజిల్, కజిరంగా ఎడిషన్లలో ఏది నచ్చితే దానిని కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హర్మాన్ ఆడియో సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పుష్-బటన్‌ స్టార్ట్‌తో కూడిన కీలెస్ ఎంట్రీలతో పాటు మొత్తం నాలుగు పవర్ విండోలు కూడా ఉన్నాయి. ఈ కారు టోర్నాడో బ్లూ, కాలిప్సో రెడ్, మీటియర్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, ఫోలేజ్ గ్రీన్, డేటోనా గ్రే, ఓర్కస్ వైట్‌లతో సహా ఎనిమిది రంగులలో వస్తుంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టాటా తన పంచ్‌ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, కార్నరింగ్ కంట్రోల్, కెమెరాలతో బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఆఫర్ చేసింది. ఈ మైక్రో SUV 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ ర్యాంకింగ్‌ సంపాదించింది. అంటే ప్రయాణికులు దీనిలో సురక్షితమైన జర్నీని ఆస్వాదిస్తారు. ఈ కారులో వీల్స్‌ను R-16 డైమండ్-కట్ అల్లాయ్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్‌లతో అమర్చారు. టాటా పంచ్‌కు మారుతి సుజుకి ఇగ్నిస్, మహీంద్రా KUV100 NXT పోటీగా నిలుస్తున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటివి కూడా పోటీనిస్తున్నాయి. అయితే సేఫ్టీ ఫీచర్ల పరంగా టాటా పంచ్ అన్నిటికంటే మెరుగైనదిగా కనిపిస్తోంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ