దేశీయ మార్కెట్లోకి ఫిబ్రవరి 26న షియోమి 13 ప్రో విడుదల చేయనుంది.  ఈవెంట్‎ను ఫేస్‎బుక్, యూట్యూబ్, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ఈవెంట్ ద్వారా ఫోన్ అధికారికంగా దేశీయ మార్కెట్లోకి అడుగపెట్టనుంది. ఈ స్మార్ట్‎ఫోన్ గతేడాది డిసెంబర్ లో చైనాలో రిలీజ్ అయ్యింది. అక్కడ ఈ ఫోన్ ధర రూ. 61,000 వరకు ఉంది. భారత్ లో ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని లీక్స్ ను బట్టి తెలుస్తోంది. షియోమీ 13ప్రో కంపెనీ నుంచి వచ్చే ఈ సరీస్ ఫోన్లు ఫ్లాగ్‎షిప్ స్మార్ట్‎ఫోన్లలలో అగ్రస్థానంలో ఉంటుంది. షియోమీ 13 ప్రో సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ఎస్ఓసి ప్రాసెసర్ తో రన్ అవుతుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జిబి ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడింది. ఈ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.78-అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. ఇది బ్యాక్ 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కోసం 1 ఇంచు సోనీ IMX989 సెన్సార్‌తో పనిచేస్తుంది. దీనికి జతగా, 50మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 5మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 4820ఎంహెఏచ్ బ్యాటరీ ఉంటుంది. వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11ని తక్కువ ధరకు విడుదల చేయడంతో…ఇప్పుడు రాబోయే ఈ కొత్త షియోమీ ఫోన్‎పై ఎంత ధర ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ డివైస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14లో రన్ అవుతుంది. కానీ భారత్ లో ఈ మొబైల్ ధర ఇంకా లీక్ కాలేదు. వన్ ప్లస్ తన స్మార్ట్ ఫోన్ 11ను భారత్ లో తక్కువ ధరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి పోటీకి రిలీజ్ అవుతున్న షియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ఎంత ధరతో లాంచ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ