వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా బ్యాంక్ మరియు భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ లో లభిస్తుంది. వన్ ప్లస్ 11 5జీ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.56,999.  హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది దీని ధర రూ.61,999. ఈ స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ICICI మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, Oneplus మరియు iOS 4G డివైజెస్ ఎక్స్ చేంజ్ పైన 6,000 రూపాయల అదనపు బోనస్ కూడా అఫర్ చేస్తోంది. వన్ ప్లస్ 11 5జీ పెద్ద 6.7 -ఇంచ్ QHD + రిజల్యూషన్ గల Super Fluid AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది Dolby Vision HDR సపోర్ట్ చేసే 10-బిట్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 2 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 4.0 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ 13.0 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. కెమెరా వెనుక భాగంలో 3rd Gen Hasselblad ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX890 సెన్సార్ ని OIS సపోర్ట్ మరియు f/1.88 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 32MP sony టెలీ ఫోటో కెమెరాని మరియు 48MP అల్ట్రా వైడ్ కెమేరాని జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 100W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ