వాట్సాప్ ఇకపై iOS 10 లేదా iOS 11లో రన్ కాదని iPhone యూజర్లకు తెలియజేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ని కొనసాగించాలంటే పాత ఐఫోన్ యూజర్లు తమ iOSని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ హెల్ప్ సెంటర్ పేజీ ప్రకారం, iPhone యూజర్లు వాట్సాప్ యాప్‌ని కొనసాగించడానికి iOS 12 లేదా అంతకంటే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. iOS 10, iOS 11 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో చాలా iPhoneలు రన్ కావడం లేదు. iPhone 5 లేదా iPhone 5Cని ఉపయోగించే iPhone యూజర్లు iOS, WhatsAppని అప్‌డేట్ చేసిన తర్వాత WhatsAppని ఉపయోగించవచ్చు. అయితే, iPhone 4, iPhone 4S యూజర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సమయం ఆసన్నమైంది. WhatsApp ఇకపై డివైజ్‌కు సపోర్టు ఇవ్వదని గుర్తించాలి. ప్రైవసీ, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో WhatsApp నిరంతరం పనిచేస్తుంది. అందుకోసం ఆపిల్, ఆండ్రాయిడ్ అందించిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సరిపోయే డెవలప్‌మెంట్‌లపై మెసేజింగ్ యాప్ ఫోకస్ పెట్టింది. వాట్సాప్ లోని కొత్త అప్‌డేట్‌లు పాత OS, డివైజ్‌లకు సపోర్టు ఇవ్వవని గుర్తించాలి. ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లకు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను కొనసాగించడానికి ఆండ్రాయిడ్ 4.1 లేదా నెక్స్ట్ వెర్షన్ కూడా అవసరమని గుర్తించాలి. ఒకవేళ మీ iPhone ఆటో-అప్‌డేట్‌లో లేనట్లయితే.. మీరు Settings > Generalకు వెళ్లడం ద్వారా iOS సరికొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. ఆపై లేటెస్ట్ iOS వెర్షన్‌ను పొందడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని Tap చేయండి. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే పండుగ సేల్ సమయంలో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో iPhone 12, iPhone 13పై బెస్ట్ డీల్స్ ద్వారా మరెన్నో డిస్కౌంట్‌లను పొందవచ్చు.
దీపావళి తర్వాత పాత ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు !
الجمعة، 21 أكتوبر 2022
iOS 10 లేదా iOS 11లో రన్ కాదని iPhone యూజర్లకు తెలియజేస్తోంది science technologe దీపావళి తర్వాత పాత ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
ليست هناك تعليقات:
إرسال تعليق