కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్‌కి భారీ జరిమానా విధించింది. మార్కెట్లో ఉన్న తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై రూ.1338 కోట్లను జరిమానా విధించింది. అంతేకాక, అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడం మానుకోవాలని హెచ్చిరించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ మొబైల్ సూట్‌ను కూడా పొందపరిచేలా షరతు విధిస్తుందన్న ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా ప్రి ఇన్‌స్టాల్ చేయాలనడం అసమంజసమని సీసీఐ చైర్ పర్సన్ అశోక్ కుమార్ ఆదేశాల్లో వెల్లడించారు.
గూగుల్‌కి రూ.1338 కోట్ల జరిమానా !
الجمعة، 21 أكتوبر 2022
google science technologe అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడం మానుకోవాలని హెచ్చిరిక గూగుల్‌కి రూ.1338 కోట్ల జరిమానా !
ليست هناك تعليقات:
إرسال تعليق