ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు అద్భుతమైన సేల్స్ తీసుకొస్తూ కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఆగస్టు నెలలో భారీ సేల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో ఎన్నో డీల్స్, డిస్కౌంట్స్‌ను తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు ముందస్తు యాక్సెస్‌ను పొందొచ్చు. ప్లస్ యూజర్ల కోసం, సేల్ ఆగస్ట్ 5 అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీల్లోనే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కూడా జరగనుండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ తన సేల్‌లో ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై భారీగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. సేల్ సమయంలో వీటిని అందుకోవచ్చు. అలానే బ్యాంక్ ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఈ సేల్‌ను ఇప్పటికే ప్రకటించింది కానీ పూర్తి స్థాయిలో ఆఫర్లను ఇంకా వెల్లడించలేదు. కొన్ని వస్తువులపై కస్టమర్లకు 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని మాత్రం వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుందని తెలిపింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఒప్పో, వివో, యాపిల్, రియల్‌మీ, పోకో, శాంసంగ్, మోటొరోలా స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉంటాయి. కచ్చితమైన ఆఫర్ల వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. కొనుగోలుదారులు ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు డిస్కౌంట్స్ అందుకోవచ్చు. హెడ్‌ఫోన్‌లు & స్పీకర్‌లపై 70% వరకు డిస్కౌంట్, టాబ్లెట్‌లపై 45% వరకు డిస్కౌంట్, ప్రింటర్లు, మానిటర్లు, మరిన్నింటిపై 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా హోమ్ అప్లయెన్సెస్‌పై గరిష్టంగా 75% తగ్గింపు, ఏసీలపై 55% వరకు, రియల్‌మీ, శాంసంగ్, Mi TVలపై 75% వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. మైక్రోవేవ్‌లపై 45% వరకు తగ్గింపుతో సహా మరిన్ని ఆఫర్లను ఈ సేల్‌లో పొందవచ్చు. టెలివిజన్, వాషింగ్ మెషీన్లు వంటి హోమ్ అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. రిఫ్రిజిరేటర్లను 60 శాతం తగ్గింపుతో విక్రయించనుంది. ఈ ఐదురోజుల సేల్ సమయంలో ప్రతిరోజూ ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్‌లను హోస్ట్ చేస్తుంది. 12 AM, 8 AM, 4 PM సేల్‌లో అద్భుతమైన డీల్స్‌ను తెస్తుంది. అదేవిధంగా, ఎర్లీ బర్డ్ స్పెషల్‌లతో రష్ అవర్ డీల్స్ ఆగస్టు 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. టిక్‌టాక్ డీల్స్ కూడా కంపెనీ తీసుకురానుంది. ఈ టిక్‌టాక్ డీల్స్ రోజులోని అతి తక్కువ ధరలతో అన్ని సేల్ రోజులలో 12 PM-10 PM మధ్య అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు 6-10 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !
الاثنين، 1 أغسطس 2022
business flipkart science technologe ఆగస్టు 6-10 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !
ليست هناك تعليقات:
إرسال تعليق