కార్యాలయానికి వచ్చి పనిచేసే తమ ఉద్యోగులకు “వ్యాక్సిన్ తప్పనిసరి” నిబంధనను ఎత్తివేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో గత జూలైలో ఉద్యోగులు, ఇంటి నుంచి పనిచేస్తున్నా, లేక కార్యాలయానికి వచ్చి పనిచేసినా వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ గూగుల్ ఆదేశాలు జారీ చేయగా వ్యాక్సిన్ తీసుకోనివారు ఉద్యోగాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు వ్యాక్సిన్ నిబంధనలు ఎత్తివేసినట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 జులై చేసిన “వ్యాక్సిన్ మ్యాండేట్” ప్రకటనను జనవరి 2022లో ఉపసహంరించుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు కరోనా నిబంధనలు (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం)ను కూడా ఎత్తివేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. నిబంధనలు ఎత్తివేయడంతో.. గతంలో మాదిరిగా ఉద్యోగులకు కార్యాలయాల్లో అందించే మస్సాజ్, ఇతర ఆటవిడుపు ప్రోత్సాహకాలను కూడా తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించడం కొసమెరుపు. గూగుల్ విధించిన వ్యాక్సిన్ మ్యాండేట్ ను వ్యతిరేకిస్తూ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులు నవంబర్ 2021లో ఒక లేఖ రాశారు. అదే సమయంలో యూఎస్ లో కరోనా ఆంక్షలు కాస్త సడలించడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని గూగుల్ ప్రధాన కార్యదర్శి లోరా లీ ఎరిక్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమెరికా ఉద్యోగులకు మాత్రమే సడలించిన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్న ఆమె..ఇతర దేశాల్లో నిబంధనల మేరకు అక్కడి ఉద్యోగులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన గూగుల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు అనేకమంది ఉద్యోగార్థులు ఉత్సాహం కనబరుస్తుంటారు. ఉచిత భోజనం, జిమ్, వ్యక్తిగత సౌకర్యాలు వంటి ఎన్నో వసతులను గూగుల్ అందించడమే అందుకు కారణం. కరోనా కారణంగా ఆఫీసులో పనిచేసే ఎంజాయిమెంట్ ను కోల్పోయామంటూ గూగుల్ ఉద్యోగులు ఒక సర్వేలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తిరిగి కార్యాలయాలకు వచ్చి.. పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని సంస్థ ప్రతినిదులు తెలిపారు. ఇక గూగుల్ కార్యాలయాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే ఇంకా వ్యాక్సిన్ తీసుకునేవారికి మాత్రం ప్రభుత్వ పరమైన ఆంక్షలు కొనసాగుతాయని కూడా గూగుల్ తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ