మోటోరోలా గ్లోబల్ లాంఛ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31లు త్వరలో భారత్ మార్కెట్‌లోనూ సందడి చేయనున్నాయి. యూరప్‌లో లాంఛ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారత కస్టమర్లకూ కొద్దినెలల్లో అందుబాటులోకి రానున్నాయి. మోటో జీ71 యూరప్‌లో లాంఛ్ కాగా కొద్దిరోజుల్లో లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాల్లోకి రానుండగా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ 25,200గా కంపెనీ నిర్ణయించింది. మోటో జీ71 ఫీచర్ల విషయానికి వస్తే..6.4 ఇంచ్‌ల ఫుల్ హెచ్‌డీప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇక యూరప్‌లో మరికొద్ది వారాల్లో సేల్ మొదలుకానున్న మోటో జీ51 రూ 19,300కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచ్‌ల ఫుల్ హెచ్‌డీప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌తో ట్రిపుల్ కెమెరాతో కస్టమర్లకు లభిస్తుంది. మరోవైపు యూరప్‌లో లాంఛ్ అయిన మోటో జీ31 త్వరలోనే భారత్ సహా లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య మార్కెట్లలో అడుగుపెట్టనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ 16,700కు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 సందడి!
الجمعة، 19 نوفمبر 2021
moto science smart phone technologe త్వరలో మోటో జీ71 మోటో జీ31 సందడి! మోటో జీ51
ليست هناك تعليقات:
إرسال تعليق