'శ్రీవల్లి' మెలోడియస్ సాంగ్

الأربعاء، 13 أكتوبر 2021

'శ్రీవల్లి' cinema అల్లు అర్జున్ మెలోడియస్ సాంగ్ రష్మిక మందన్న

t f B! P L

 

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మెలోడీయస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పై సాగిన 'శ్రీవల్లి' సాంగ్ ను తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్, కంపోజిషన్ ఆహ్లాదకరంగా ఉంది. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో ఈ సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చంద్రబోస్ లోతైన సాహిత్యం ఆకట్టుకుంటుంది. పుష్ప రాజ్, శ్రీవల్లిల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. పుష్ప రాజ్ మనసులో తాను ప్రేమిస్తున్న శ్రీవల్లిపై ఉన్న ఫీలింగ్స్ ను ఈ సాంగ్ ద్వారా బయట పెట్టారు. 'పుష్ప: ది రైజ్' నుంచి ఇప్పటికే విడుదలైన 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ఇప్పటికే 80 మిలియన్ల వ్యూస్ దాటి రికార్డులు కొల్లగొట్టింది. మరి ఈ సాంగ్ కూడా దూసుకెళ్తుందేమో చూడాలి. ప్రస్తుతం చిత్రీకరణం దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. 'పుష్ప: ది రైజ్' ఈ ఏడాది డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ