రూ.3 వేలలోపు బెస్ట్​ స్మార్ట్​వాచ్​లు!

الأربعاء، 6 أكتوبر 2021

t f B! P L
చేతికి ధరించే స్టైలిష్​ స్మార్ట్​ వాచ్​, ఫిట్​నెట్​ బ్యాండ్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ స్మార్ట్​ ఉత్పత్తులతో ఎప్పటికప్పుడు మన శరీర ఉష్ణోగ్రత, ఫిట్​నెస్ వివరాలు​ ట్రాక్​ చేసే అవకాశం ఉండటంతో కరోనా తర్వాత ఈ మార్కెట్ మరింతగా వృద్ది చెందింది. అందుకే ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్లు వీటి తయారీపై దృష్టి పెట్టాయి. ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ నిర్వహిస్తున్న గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో వీటిని సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్​లో రూ .3 వేలలోపు లభిస్తున్న వేరబుల్ డివైజ్‌ల గురించి తెలుసుకుందాం! బోట్​ ఎక్స్​టెండ్​ స్మార్ట్ వాచ్ బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ .2,999 వద్ద ఉండగా.. అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో దీన్ని కేవలం రూ .2,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 1.69 అంగుళాల టచ్-స్క్రీన్ ఎల్​సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. యూఐ ద్వారా నావిగేట్ చేయడానికి దీనిలో ఒక సర్క్యులర్ డయల్​ను కూడా అందించింది. బోట్​ ఎక్స్​టెండ్​ 24/7 హార్ట్​రేట్ మానిటరింగ్​, SPO2 మానిటరింగ్​, స్లీప్​ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది 5ATM వాటర్‌ఫ్రూఫింగ్, 300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 7-10 రోజుల బ్యాటరీ బ్యాకప్​ను అందిస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్​ను రూ. 1,699 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్​ 1.4 అంగుళాల ఎల్​సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 24/7 హార్ట్​ రేట్​ మానిటరింగ్​, SpO2 మానిటరింగ్​కు మద్దతునిస్తుంది. దీని ద్వారా కాల్స్​ను అటెంప్ట్​ చేయడం, ఎస్​ఎమ్​ఎస్​లను పంపడం, మ్యూజిక్​ను నియంత్రించడం వంటివి చేయవచ్చు. 210mAh బ్యాటరీ గల ఈ ఫిట్​నెస్​ బ్యాండ్​ 10 రోజుల బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది. ఎంఐ బ్యాండ్ 5 రూ. 3 వేలలోపు ధరలో బెస్ట్​ ఫిట్​నెస్​ బ్యాండ్​ కోసం చూస్తుంటే ఎంఐ బ్యాండ్ 5 బెస్ట్ ఆప్షన్​. ఇది టాప్ ఫిట్‌నెస్ ట్రాకర్లలో ఒకటిగా కొనసాగుతోంది. దీని అసలు ధర రూ .2,499 వద్ద ఉండగా.. అమెజాన్​లో ఇప్పుడు కేవలం రూ .1,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎంఐ బ్యాండ్ 5 ఫిట్​నెస్​ బ్యాండ్​ 1.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 5ATM వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంటుంది. ఇది మొత్తం 11 స్పోర్ట్స్ మోడ్‌లలో పనిచేస్తుంది. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్​, స్లీప్​/ప్రెజర్​ ట్రాకింగ్, ఉమెన్​ హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీనిలోని 125 ఎంఏహెచ్​ బ్యాటరీ 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. వన్‌ప్లస్ బ్యాండ్ వన్​ప్లస్​ బ్యాండ్ అసలు ధర రూ. 2,499 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 1,799 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 1.6 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మొత్తం 13 ఎక్సర్‌సైజ్ మోడ్స్‌కు మద్దతిస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్-రేట్ సెన్సార్​ ఫీచర్లతో వస్తుంది. వన్‌ప్లస్ బ్యాండ్ IP68 సర్టిఫికేషన్​, 5 ATM వాటర్​ రెసిస్టన్స్​ను కలిగి ఉంటుంది. దీనిలోని 100mAh బ్యాటరీ 14 గంటల బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. బోట్​ వాచ్ ఫ్లాష్ పై అన్ని వాచ్​లలో కెల్లా రౌండ్ డయల్ ఉన్న ఏకైక స్మార్ట్​వాచ్​ బోట్​ వాచ్ ఫ్లాష్. అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో దీన్ని కేవలం రూ. 2,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 1.3 -అంగుళాల ఎల్​సీడీ ప్యానెల్‌ డిస్​ప్లేతో వస్తుంది. ఇది IP68 డస్ట్/వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 10 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. హార్ట్​ రేట్​ మానిటరింగ్​, SPO2 మానిటరింగ్​ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిలోని 200mAh బ్యాటరీ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ