వారానికొకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి

الأربعاء، 15 سبتمبر 2021

safe science technologe వారానికొకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి

t f B! P L

 

మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో.. మొబైల్ హ్యాక్ చేయడం లాంటి నేరాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో మొబైల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన సమాచారాన్ని కూడా చరవాణిలో భద్రపరచడానికి అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం కార్డు పిన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లను,ఆధార్ కార్డు పాన్ కార్డు సహా మిగతా కొన్ని రకాల డాక్యుమెంట్లను కూడా మొబైల్లో భద్రపరచడం లాంటివి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక హాకర్లు కూడా రెచ్చిపోతూ మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తూ ఏకంగా కీలక సమాచారాన్ని దొంగలిస్తున్నారు. అయితే హ్యాకర్ల చేతికి మొబైల్ చిక్కకుండా ఉండాలి అంటే ఇటీవలే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఒక సూచన చేసింది. లాప్టాప్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా స్లో గా ఉన్నప్పుడు సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం లాంటివి చేస్తారు. అలాగే మొబైల్ ని కూడా వారానికి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఎంతో మంచిది అంటున్నారు. ఇక తరచూ చేసినా కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొద్దు అని సూచిస్తున్నారు.

మొబైల్ ఉపయోగిస్తున్న సమయంలో బ్లూటూత్‌ను డిసేబుల్‌ చేయాలి.

* ఫ్రీగా వస్తుంది కదా అని పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను అస్సలు ఉపయోగించకూడదు . అనవసరంగా వైఫై ఆప్షన్ ను ఆన్ లో పెట్టకూడదు.

* ఏదిపడితే అది కాకుండా మీ మొబైల్ లో కేవలం ఎక్కువగా అవసరం అయినవి మాత్రమే అంటే వీలైనంత తక్కువ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం బెటర్.. డౌన్లోడ్ చేసిన యాప్ l లకు వ్యక్తిగత సమాచారం ఇచ్చే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండటం మంచిది.

* మొబైల్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ , యాప్స్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేస్తూ ఉండడం వల్ల అటు మొబైల్ పర్ఫామెన్స్ కూడా బాగుంటుంది .

* ఇక మీ మొబైల్ మరింత సురక్షితంగా ఉండేందుకు ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ వంటి బయోమెట్రిక్‌ ఫీచర్లు వాడుకోవడం బెటర్ .

* ఇక కీలకమైన సమాచారాన్ని ఆటోమొబైల్ ఫోన్లో భద్రపరుచుకోకపోవటమే ఎంతో మంచిది.

* ఏది పడితే అది కాకుండా కేవలం ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్ ని మాత్రమే ఉపయోగిస్తే మంచిది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ