కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.. హరియాణాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకున్నారో వివరించారు. కొత్త ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేను సమీక్షించేందుకు వెళ్లిన సందర్భంగా గడ్కరీ తన అనుభవాలను ప్రస్తావించారు. కరోనా సమయంలో తాను రెండు విషయాలను బాగా వినియోగించుకున్నానని చెప్పుకొచ్చారు. అందులో మొదటిది.. ఇంట్లో కుకింగ్ చేయడం మొదలుపెట్టారట. ఫుడ్ ఎలా తయారు చేయాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పారట.. అందుకు వేదికగా యూట్యూబ్ ఎంచుకున్నారట.. ఆన్ లైన్లో తాన కుకింగ్ పాఠాలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారంట.. దాంతో తన ఛానల్ కు ఫుల్ వ్యూయర్ షిప్ వచ్చింది.. అలా తన యూట్యూబ్ ఛానల్ నెలకు లక్షలు సంపాదించే స్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు.
యూట్యూబ్ ద్వారా 4 లక్షలు సంపాదిస్తున్నాను !
الجمعة، 17 سبتمبر 2021
minister nitin technologe youtube యూట్యూబ్ ద్వారా 4 లక్షలు సంపాదిస్తున్నాను !
ليست هناك تعليقات:
إرسال تعليق