పేటీఎం. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో యూజర్లను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది పేటీఎం. ఇటీవల గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా మూడు నెలలు రూ.2,700 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పైనా పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా మొదటిసారి కరెంట్ బిల్ చెల్లిస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇప్పటికే కరెంట్ బిల్స్ చెల్లిస్తున్నవారికి రివార్డ్స్ కూడా లభిస్తాయి. అన్ని రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డుల బిల్ పేమెంట్స్‌కు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APSPDCL, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-APEPDCL, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APCPDCL బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు. ఇక తెలంగాణలోని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్-TSNPDCL, కోఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సప్లస్ సొసేటీ లిమిటెడ్ సిరిసిల్ల బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు.
కరెంట్ బిల్ కడితే పేటీఎం క్యాష్‌బ్యాక్
الجمعة، 20 أغسطس 2021
ليست هناك تعليقات:
إرسال تعليق