కొనుగోలుదారులకు శుభవార్త !

الخميس، 5 أغسطس 2021

business elecric vehicle science subsidy technologie

t f B! P L

 


ఇంధన వాహనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు.  ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్ల జారీకి కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ-స్కూటర్​ లేదా బైక్ కొనుగోళ్లకు అయ్యే ఖర్చు కనీసం రూ. 1000 తగ్గుతుందని ఆటోమొబైల్​ డీలర్స్​​ అసోసియేషన్ పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో​ ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్​ కార్ల​ కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలను రెట్టింపు చేశాయి. FAME II పథకంలో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోళ్లపై రెట్టింపు సబ్సిడీ అందిస్తున్నాయి. మూడు రాష్ట్రాలతో పాటు మరో 20 రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో పాలసీని సిద్ధం చేస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ