జియోమీ ఎంఐ పేరుతో సరికొత్త ఎల్ఈడీ టీవీలను ఇండియా మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ టీవీ బ్రాండ్స్ ధర కంటే తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ టీవీలను అందిస్తూ.. ఎంఐ వార్తల్లోకెక్కింది. తాజాగా ఎంఐలో 5 ఎక్స్ మోడల్ టీవీని రిలీజ్ చేస్తున్నట్టు ఎంఐ ప్రకటించింది. ఆగస్టు 26న జియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో ఈ టీవీని లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్ సిరీస్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు.. మెటల్ ఫినిష్, ఫైన్ ట్యూన్డ్ విజువల్స్, న్యూ జనరేషన్ ఆఫ్ పాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ లాంటి ఫీచర్స్ ఎంఐ టీవీ 5ఎక్స్‌లో ఉన్నాయి. ఎంఐ టీవీ 5ఎక్స్‌లో 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఎంఐ టీవీ 5ఎక్స్‌తో పాటు.. ఇతర ప్రాడక్ట్స్‌ను కూడా జియోమీ ఆరోజు విడుదల చేయనుంది. ఎంఐ బాండ్ 6, ఎంఐ నోట్‌బుక్‌ను కూడా ఈవెంట్‌లో రిలీజ్ చేస్తారు.డాల్బీ పవర్డ్ ఆడియో, క్లాస్ లీడింగ్ పవర్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం ఫార్ ఫీల్డ్ మైక్స్, ఎస్‌వోసీ లాంటి సరికొత్త ఫీచర్స్ ఈ టీవీ ప్రత్యేకతలు. అయితే.. ఎంఐ టీవీ 5ఎక్స్ ధర ఎంతో మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఆగస్టు 26న ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్
السبت، 21 أغسطس 2021
ليست هناك تعليقات:
إرسال تعليق