హైదరాబాద్‌లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పోరేషన్ (టీజీఎల్ఐపీసీ) ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధికి, ఆర్టిజన్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలీలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా రాష్ట్రంలోని ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ యాడెడ్)ను జోడిస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో సుమారు వేయి మందికి ఉపాధి కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజైనింగ్ మొదలు బ్రాండింగ్ వరకు వారికి మార్గనిర్దేశం చేస్తామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్ లో మైక్రో స్మాల్ ఎంటర్ ప్రైజెస్ క్లస్టర్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈసీడీపీ) కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో లిడ్ క్యాప్ కు ఎక్కడెక్కడ భూములు కేటాయించారు. వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన నివేదిక అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, టీజీఎల్ఐపీసీ వీసీ అండ్ ఎండీ ప్రశాంత్ కుమార్, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ డా.ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

أحدث أقدم
3