ఎలుగుబంటి దాడిలో రైతు మృతి

తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ శివారులో ఎలుగుబంటి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన మిన్నలాపురం సిద్దయ్య (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దయ్య తన వ్యవసాయ భూమి వద్ద పాలు పిండేందుకు వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తోంది. సాధారణ పనుల కోసం వెళ్లిన రైతు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

إرسال تعليق

أحدث أقدم
3