అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి హఠాన్మరణం

తెలంగాణలోని ఖమ్మం వర్తక సంఘం దిగుమతి శాఖ అధ్యక్షులు నల్లమల్ల ఆనంద్ కుమార్తె నల్లమల్ల అక్షిత (26) అమెరికాలో అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ దారుణ ఘటనతో ఖమ్మంలోని ఆమె కుటుంబంలో, స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన అక్షిత ఎంఎస్  చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ రాష్ట్రంలోని ఆల్బనీ ప్రాంతంలో తన సోదరుడు అక్షయ్‌తో కలిసి నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అక్షిత తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తూ ఖమ్మంలో ఉన్న తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. అలా తండ్రితో మాట్లాడి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి, గది బయటికి వచ్చిన సోదరుడు అక్షయ్ పరిశీలించగా అక్షిత కిందపడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఆమె సోదరుడు, తోటి విద్యార్థుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్షితను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రితో ఆప్యాయంగా మాట్లాడిన కుమార్తె క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారాడమన్న వార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖమ్మం వర్తక సంఘం సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


إرسال تعليق

أحدث أقدم
3