ఎలక్ర్టిక్ కారును కానుకగా బహూకరించి గురుభక్తిని చాటుకున్న పూర్వ విద్యార్థులు

الجمعة، 2 أكتوبر 2026

Alumni Demonstrate Reverence for Teacher by Gifting an Electric Car DIET College in LMD Karimnagar district telangana Thimmapur Mandal

t f B! P L

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ డైట్ కళాశాలలో 24 ఏళ్లు లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన గుర్రం మహేశ్వర్ రెడ్డికి పూర్వ విద్యార్థులు ఎలక్ర్టిక్ కారును కానుకగా బహూకరించారు. 2002 నుండి 2026 వరకు డైట్ లో చదివిన పూర్వ విద్యార్థులంతా కలిసి ఎలక్ర్టిక్ కారును గురువుకు కనివిని ఎరుగని రీతిలో చిరుకానుకగా అందించి గురుభక్తిని చాటుకున్నారు. పూర్వ విద్యార్థులంతా డైట్ కి చేరుకుని గురువుకు ఘనంగా వీడ్కోలు పలికారు. డైట్ ప్రాంగణంలో చేరిన విద్యార్థులను తీర్చిదిద్దిన శిల్పిగా మహేశ్వర్ రెడ్డిని కొనియాడారు. ఆయన భాటలో నడుస్తామని మాటిచ్చారు. తాము సైతం ఉపాధ్యాయులుగా భావి తరాలను తీర్చిదిద్దుతామని హామిచ్చారు. దేశ రక్షణ, దేశాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తమకు మహేశ్వర్ రెడ్డి నేర్పినట్లు... తాము అలాగే తమ విద్యార్థులకు నేర్పుతామని తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందించిన ఇలాంటి గువురును జీవితంలో చూడలేమన్నారు. ముత్యాల్లాంటి అక్షరాలను రాసేలా చేతి రాతను నేర్పినాడని, అందుకే డైట్ విద్యార్థుల చేతిరాత అమోఘంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయుడు, సంస్థ, విద్యార్థి ఎలా ఉండాలనేది మహేశ్వర్ రెడ్డి నేర్పించినట్లు తెలిపారు. పని వేళల్లోనే కాకుండా అంతకు మించి రాత్రి వరకు తమ వెంట ఉండి తన జీతం నుండి ఖర్చు చేసి తీర్చిదిద్దినట్లు తెలిపారు. అందుకే ఎల్ఎండీ డైట్ లో చదివిన వారంతా అత్యధికంగా ఉద్యోగాలు సాధించినట్లు స్థిరపడినట్లు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక శిల్పి అని కొనియాడారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ