బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి ఇండియాకు వస్తున్న సమయంలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలతో సంచలనంగా మారింది. ఈ వీడియోతో సంబంధం ఉందని భావిస్తున్న మాజీ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కేఎం తహ్సీఫ్ సౌదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మరణించారు. షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించిన సమయంలో ఈ మరణం చోటుచేసుకుంది. ఢాకాలోని తురాగ్ నదిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 28 ఏళ్ల సౌరీ అక్టోబర్ 27 నుంచి కనిపించకుండా పోగా, అక్టోబర్ 28న ఆయన మృతదేహం లభ్యమైంది. సౌరీది హత్యేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తొలుత గుర్తుతెలియని మృతదేహంగా భావించినప్పటికీ, ఆయన ఐఫోన్, చేతి గడియారం ద్వారా మృతుడు సౌరీ అని పోలీసులు గుర్తించారు. ఆయన మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచివెళ్తున్న వీడియో సమయంలో సౌరీ పేరు వినిపించింది. ఆయన బంధువు మోష్ఫేకా జహాన్ సోషల్ మీడియాతో దీనిని హత్యగా ఆరోపించారు. హసీనా దేశం విడిచి వెళ్తున్న సమయంలో వైరల్ అయిన వీడియోతో ఆయన వేధింపులకు గురయ్యారని, ఆ తర్వాత హత్యకు గురయ్యారని ఆరోపించారు. హసీనా పారిపోతున్న వీడియోను షేర్ చేయడమే ఆయన తప్పా? అని ప్రశ్నించారు. అయితే, ఆ వీడియోను సౌరీ స్వయంగా చిత్రీకరించలేదని, మరో సహోద్యోగి రికార్డ్ చేసిన దృశ్యాలను ఆయన షేర్ చేశారని జహాన్ ఆరోపించారు. వీడియో ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీవ్ర మానసిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా డిటెక్టివ్లు ఆయనను వెంబడించే వారని ఆరోపించారు.
షేక్ హసీనా దేశం విడిచి ఇండియాకు వస్తున్న వీడియో వివాదం : బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుమానాస్పద మృతి
byTelugu Lo Computer
•
•
2 min read
