ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన

الاثنين، 5 أكتوبر 2026

​​Andhra Pradesh Chief Minister Chandrababu's Two-Day Visit to Delhi departing on the 7th of this month state cabinet meeting is scheduled for Wednesday morning

t f B! P L

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకుఈ నెల 7వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. బుధవారం ఉదయం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఆయన నేరుగా ఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కీలక కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యక్ష మౌలిక సదుపాయాల గ్రాంట్లకు సంబంధించిన నిబంధనలపై ఆయన కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసే వీలుగా కేంద్రం ఆమోదించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని జలశక్తి మంత్రిని కోరనున్నారు. విశాఖపట్నం మెట్రో సహా పలు అంశాల పైన కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాల పరిష్కారంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం పొందే అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కేంద్రంలో ప్రస్తుతం సీఈసీ వివాదం, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ చట్టం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పైన కీలక మంత్రాంగం కొనసాగుతోంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోదీ టీం కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత దక్కనుంది. దీంతో,నిర్ణయాలతో పాటుగా టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ